Header Banner

సీఎం చంద్రబాబును కలిసిన ఎన్నారై టీడీపీ సభ్యులు! బాధిత కుటుంబానికి ఆర్ధిక సహాయంగా..

  Thu Apr 03, 2025 14:18        Bahrain, Helping Hand

భారతదేశం నుండి ఆర్ధికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఎన్నో ఆశలతో దేశం విడిచి చాలా మంది విదేశాలకు వెళుతుంటారు. కానీ కొన్ని సందర్భాలలో మనం ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఇలాంటిదే ఈ మధ్య పొన్నూరు కు చెందిన కాట్రు అశోక్ చంద్ర కుమార్ కు కూడా జరిగింది. 4 నెలల క్రితం ఉద్యోగం కోసం జర్మనీ వెళ్ళడం జరిగింది. కుటుంబం ఆర్ధికంగా సెటిల్ అవుతుంది అనుకునే సమయంలో మార్చ్ 7 న అనుకోని విధంగా హార్ట్ ఎటాక్ తో జర్మనీ లో మృతిచెందారు. అతని భార్య, 7 ఏళ్ల కూతురు ఇండియాలోనే ఉంటారు. 

 

ఈ హతాట్ మరణ వార్త విని వారి బంధువులు అందరూ తల్లడిల్లిపోయారు. అక్కడ ఉన్న ఎన్నారై టీడీపీ సభ్యులు డాక్యుమెంటేషన్ పనులు పూర్తి చేసి అతని మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తరలించారు. అశోక్ పార్ధివదేహాన్ని తరలించడానికి, అలాగే మృతుని కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎన్నారై టీడీపీ సభ్యులు ఆన్ లైన్ లో గో ఫండ్ రైజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జర్మనీ మరియు యూరోప్ దేశాలకు చెందిన వారు మానవతా దృక్పథం తో స్పందించి వారికి చేయూతనివ్వడం జరిగింది. అలా సేకరించిన మొత్తాన్ని మృతదేహాన్ని తరలించడానికి ఉపయోగించి, మిగిలిన మొత్తాన్ని వారి కుటుంబానికి అందించాలని సభ్యులు నిర్ణయించారు.

 

అందులో భాగంగా రూ. 9,25,000 లను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఎన్నారై టీడీపీ కోఆర్డినేటర్ సమక్షంలో బాధితుడి కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది. ఎంతో మంచి మనసుతో కష్టాల్లో ఉన్న ఆ కుటుంబానికి ఈ సహాయం చేసినందుకు సీఎం చంద్రబాబు, దీనికి ఎంతగానో కృషి చేసిన సుమంత్, శ్రీకాంత్, మహేందర్ మరియు వారి టీం తో పాటు ఎన్నారై టీడీపీ జర్మనీ సభ్యులను మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారై టీడీపీ సభ్యులను ఎంతగానో అభినందించారు. అలాగే ఇటీవల ప్రారంభించిన P4 కార్యక్రమంలో కూడా ఎన్నారైలు అందరినీ భాగం కావాలని సూచించారు.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఆపదలో ఆదుకుని ఈ మొత్తాన్ని అందచేసినందుకు బాధితుడి కుటుంబ సభ్యులు సహాయం చేసిన వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేశారు. 

 

ఇలాంటి ఒక సంఘటన జరిగిన వెంటనే స్పందించి అతని పార్థీవదేహాన్ని తరలించడంలో సహాయపడినవారికి ఎన్నారై మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎన్నారై టీడీపీ ప్రెసిడెంట్ డా. రవి వేమూరు, కోఆర్డినేటర్ చప్పిడి రాజ శేఖర్ పేరు పేరునా వీరందరికీ కృతజ్ఞతా అభివందనాలు తెలియచేశారు. 

 

అదే విధంగా నిన్న (02-04-2025) బహరైన్ దేశం నుండి వచ్చిన ఎన్నారైలు సీఎం చంద్రబాబు గారెని కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 4,00,000 అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై టీడీపీ బహరైన్ ప్రెసిడెంట్ రఘునాధ బాబు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బాల కృష్ణ, మహేశ్వర రెడ్డి, శివ పాల్గొని చెక్కు ను సీఎం చంద్రబాబు నాయుడు గారికి అందించడం జరిగింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వారు అందర్నీ ఓపికగా కలిసి వారి గురించి అడిగి తెలుసుకొని వారు సమాజం పట్ల బాధ్యతతో చేస్తున్న పనులకు వారందరినీ అభినందించారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రభుత్వానికి మరో శుభవార్త.. అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులు.! రాజధాని నిర్మాణంలో దూసుకుపోవడమే..

 

తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - 100 శాతం ప్రక్షాళన.. టీటీడీ సమీక్షలో సీఎం కీలక ఆదేశాలు!

 

ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త.. మరో బైపాస్కు గ్రీన్ సిగ్నల్! ఆ నాలుగు గ్రిడ్ రోడ్లు శాశ్వతంగా.. ఇక స్థలాలకు రెక్కలు?

 

సీఐడీ కస్టడీకి రంగా!… వంశీ గుట్లన్నీ వీడినట్టే.? ఈ కేసులో కీలక పరిణామం..!

 

పార్టీ కార్యకర్తలతో మీటింగ్‌లో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! దీని ఆధారంగా నామినేటెడ్, పార్టీలో పదవులు స్పష్టం!

 

మాజీ మంత్రికి షాక్.. మరోసారి నోటీసు జారీ చేసిన పోలీసులు!

 

కొడాలి నాని ఆరోగ్యంపై వైద్యుల షాకింగ్ ప్ర‌క‌ట‌న‌! నెటిజన్లు భారీగా కామెంట్లు - సోషల్ మీడియాలో హల్ చల్!

 

ఇంటర్ విద్యార్ధులకు బిగ్ అప్డేట్ - ప్రభుత్వం తాజా మరో కీలక నిర్ణయం! కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.!

 

దారుణం.. ఉగాది రోజున గుడికి వెళ్లిన యువతిపై 8మంది సామూహిక అత్యాచారం.! ఎక్కడంటే!

 

ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్, నేను కోరుకుంది ఇదే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!

 

అయ్య బాబోయ్.. చికెన్, మటన్ తినే వారికి బిగ్ షాక్.. తింటే ఇక అంతే - ఏంటని అనుకుంటున్నారా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 


   #AndhraPravasi #NRIs #HelpingHand #TDP #Germany #Bahrain #Qatar #Death #FinancialHelp